రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

  • తనపై నమ్మకంతో కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్న నరేందర్ రెడ్డి
  • తెలంగాణ హక్కులపై సభలో పోరాటం చేస్తానని వెల్లడి
  • ప్రమాణ స్వీకారం చేసిన కొత్తగా ఎన్నికైన సభ్యులు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల పలువురు నేతలు రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తన మీద నమ్మకంతో రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ ప్రజలు, సమస్యలు, రాష్ట్ర హక్కులు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పార్లమెంటులో పోరాటం చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల వికాసం, అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, తెలంగాణ నుంచి ఎన్నికైన మరో కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ తదితరులు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.

Vem Narender Reddy
Rajya Sabha
Telangana Congress
Parliament
Rajya Sabha MP
Abhishek Manu Singhvi

More Telugu News